Sunday, July 10, 2011


గుండెలో భావాన్ని

బయటకు తీయబొతే -

బరువుగా ..

రాలేదు గాని

దాని ప్రతిరూపం,

భాషలేని ఏదో నీటి తెరగా

కన్రెప్పల్లొ తేలింది

నీటి అద్దంలో
తన అందాన్ని
చూసుకుంటోంది
చెట్టు!!!

పొదుపుగా
వాడుకోవాల్సింది..
నీళ్ళనే కాదు,
కన్నీళ్ళని కూడా!!!

ఆకాశం
అదేపనిగా
ఎన్నిసిగరెట్లు కాలుస్తోందో ఏమో..
లేకపోతే
ఇన్ని పొగమబ్బులెక్కడివీ?